![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -164 లో... రాజ్, కావ్య ఇద్దరు ఇంటికి రాగానే కావ్యని కళ్యాణ్ పిలిచి తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉందని చెప్తాడు. ఆ తర్వాత కావ్య డల్ గా గదిలోకి వెళ్తుంది. ఏమైందని రాజ్ అడుగగా.. ఏం లేదని కావ్య చెప్తుంది. రాజ్ వెళ్లి ఏమైంది అని కళ్యాణ్ ని అడుగుతాడు. వదిన వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, ఇల్లు కూడా తాకట్టులో ఉందంట హెల్ప్ చేస్తానంటే వద్దంటుందని కళ్యాణ్ అంటాడు. ఎందుకు హెల్ప్ తీసుకుంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా అని రాజ్ అంటాడు.
ఆ తర్వాత కావ్య రాత్రి డిజైన్స్ వేస్తుంటుంది కానీ డిజైన్స్ ఆలోచనలు రాక పేపర్స్ అన్ని వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ నిద్ర నుండి లేచి ఆ వేస్ట్ చేసిన పేపర్స్ చూసి చాలా బాగున్నాయి డిజైన్స్ అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. అసలేంటి ప్రాబ్లమ్ అని కావ్యని రాజ్ అడుగుతాడు. అయిన కావ్య చెప్పకుండా పడుకుంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కావ్య టీ కోసం వెయిట్ చేస్తుంటారు. కావ్య పరధ్యానంలో ఉండి ఒకరికి ఇచ్చేది మరొకరికి ఇస్తుంది. దాంతో అందరూ ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతారు. ఏం లేదని చెప్పేసి కావ్య వెళ్లిపోతుంది. అదంతా రాజ్ పై నుండి చూస్తాడు.
మరొకవైపు కనకం కృష్ణమూర్తి ఇద్దరు ఇల్లు అమ్ముతున్నందుకు బాధపడుతుంటారు. సొంత ఇల్లు అనేది ఒక మధ్యతరగతి వాడి ఆశయమని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొక వైపు రాజ్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే కావ్య వచ్చి.. మిడిల్ క్లాస్ కి అవసరమైన డిజైన్స్ ఎలా ఉండాలో ఇదిగొండని, తను వేసిన డిజైన్స్ చూపిస్తుంది. ఆవి చూసిన రాజ్ బాగున్నాయంటూ కావ్యకి చెప్తాడు. వీటి గురించి వివరించాలి ఆఫీస్ కి పదా అని రాజ్ అనగానే.. లేదు నాకు పని ఉందని కావ్య అంటుంది. రాజ్ వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి కావ్యకి ఇవ్వగా, ఎందుకని కావ్య అడుగుతుంది. డిజైన్స్ వేసావ్ గా అందుకే అని రాజ్ అంటాడు. అవి నేను ఫ్రీగా వేసానని కావ్య అనగానే.. ఫ్రీగా తీసుకొనే అలవాటు నాకు లేదని డబ్బులు ఇస్తాడు రాజ్. కావ్య ఆ డబ్బులు తన ఫ్యామిలీకి ఇవ్వాలని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు కళ్యాణ్ కి ఒక కొరియర్ వస్తుంది. అభిమాన పాఠకురాలు అనే పేరుతో రావడంతో.. కావ్య ఆ కొరియర్ ని తీసుకొని చదువుతానని అటపట్టిస్తుంది. వద్దంటూ కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |